రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

157చూసినవారు
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సోమవారం నాడు అరకువేలి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నుండి యాండపలివలస వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం కిల్లో. సురేంద్ర మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టే రైతన్నకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయిన రైతులు దేశ భవిష్యత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రైతన్నలకు లోకమంతా సెల్యూట్ చేస్తుంది.

బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానిల సేవలో భాగంగా రైతులకు ఉగ్రవాదులతో పొలుస్తున్నారు. పది ధపలుగా చర్చలు చేపడుతున్నప్పటికి రైతుల పక్షాన నిలబటంలేదు.
భవిష్యలో అన్నం పెట్టే రైతన్నకు సమస్య తీవ్రతరమై వ్యవసాయ నిర్విర్యం కావడానికి దారి తీస్తుంది. దేశ భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొని మోడీ ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బైక్ ర్యాలీ చేస్తూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, సీఐటీయు మండల కార్యదర్శి పొద్దు.బాలదేవ్, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, శరత్ పౌర సంక్షేమ అధ్యక్షులు డి.గవర్ధన్, యుటిఎఫ్ నాయకులు కె.రఘునాధ్, వి.మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు అర్జున్, కె.రామారావు తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్