విద్యుత్ సంస్కరణ బిల్లు, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువ్యాలీ మండల కేంద్రంలో శనివారం కరపత్రాలు పంపిణీ చేసి అన్నదాతలకు అండగా ఉంటామని ప్రచారం చేశారు. గిరిజన ప్రాంతాల్లో జిసిసి ఉత్పతుల సేకరణకు ఇబ్బందులు కలుగుతుందని.. డిఆర్ డిపోల నిర్వీర్యం అవుతాయన్నారు. ఉచిత విద్యుత్ సబ్సిడీ వంటి పథకాలు పేదవాడికి ఉండదని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కేంద్రం ప్రభుత్వం తక్షణమే ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం
మండల కార్యదర్శి పి.రామన్న, భగత్ రాం, బుజ్జిబాబు, సత్యరావు పాల్గొన్నారు.