పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ తులభరంగి గ్రామంలో శనివారం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, విద్యాప్రమాణాలు పెంచాలని పాఠశాల చైర్మన్ జగ్గారావు తెలిపారు. విద్యార్దులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని పాఠశాల ఉపాధ్యాయులు కొర్ర. క్రష్ణారావు తెలిపారు.