తులభరంగి గ్రామం లో రహదారి కష్టాలు

767చూసినవారు
తులభరంగి గ్రామం లో రహదారి కష్టాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలంలో, పెద్ద కోడపల్లి పంచాయతీలో "తులబరంగి" గ్రామము జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ గ్రామానికి చేరడానికి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో రహదారి దారుణమైన స్థితిలో ఉన్నది. చాలా రోజుల నుంచి సంపూర్తిగా ఉన్నందువల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో మెటల్ చిప్స్ వేసి, దానిపైన మట్టి వేస్తున్నారు. ఇటీవల వర్షం కారణంగా, వాహనదారులు పడిపోవడం జరుగుతుంది. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. కావున వెంటనే రహదారిని తారు రహదారిగా వేయాలని గ్రామస్తులు కోరడం జరిగినది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్