లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు

2272చూసినవారు
లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు
విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు ఐదో నెంబర్ మలుపు వద్ద లోయలోకి పర్యాటకుల బస్సు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయారు. మృతులంతా హైదరాబాద్ (షేక్ పేట) కు చెందిన వారిగా గుర్తించారు. అరకు అందాలు తిలకించి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీస్ లు,108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొత్తంగా బస్సులో 24 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. తీవ్ర గాయాలైన వారికి ఎస్. కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన దినేష్ ట్రావెల్స్ గుర్తింపు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్