కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం

1599చూసినవారు
కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం
అరకు నియోజకవర్గం పెదబయలు మండలం సీకరి పంచాయితీ చెందిన వి సన్యాసిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి సంస్థ డైరెక్టర్, డుంబ్రిగుడ మండలం సాగర పంచాయితీ చెందిన శోభ సోమేశ్వరి స్వచ్ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లగా నియామింపకబడిన శుభసందర్బంగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వారిరువురిని అభినందిస్తు, పుష్పగుచ్చంతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జగనన్న నాయకత్వం, నా సారధ్యంలో ఇద్దరు డైరెక్టర్ల నియమించడం సంతోషకరం అని తెలిపారు.

గిరిజనులంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో మక్కవ, గిరిజన సలహా మండలి సభ్యుల ద్వారా అభివృద్ధి, ఎంపీటీసీ జడ్పీటీసి ఎన్నికల రిజర్వేషన్ 100 శాతం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల వైసీపీ నాయకులు వెంకన్న, ఆనంద్, కనకరాజు, సూరయ్య, డుంబ్రిగుడ మండల వైసీపీ నాయకులు శ్రీరాములు, కృష్ణారావు, వెంకట్రావు, గణపతి, సింహాచలం, నర్సింగరావు, ఆనంద్, శాంతి, లీలరాణి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్