విశాఖ జిల్లా అరకునియోజకవర్గం మండల కేంద్రంలో ఆరు మండలాల 134 పంచాయితీ స్థానాల్లో 94 పంచాయితీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్నట్లు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మద్దతుదారుల విజయోత్సవ సభలో నూతన ఎన్నికైన సర్పంచ్ లను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సభలో ముఖ్య అతిధిగా అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవి, మాజీ ఎమ్మెల్సీ అరకు, పాడేరు ఎన్నికల పరిశీలికుడు సూర్యనారాయణ రాజు, ఎంపీ భర్త శివప్రసాద్,వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెట్టి వినయ్ పాల్గొన్నారు.ఎంపీ మాట్లాడుతూ జోహార్ వైఎస్సార్, జై జగన్, అనే నినాదాలతో సభ ప్రాంగణంలో తెలుపుతూ నూతనంగా గెలుపు పొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరు మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ యార్డ్ కమిటీలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.