విశాఖ జిల్లా అరకువేలి మండలం పెదలబుడు పంచాయితీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కిల్లో సత్యానందం నామినేషన్ దాఖలు చేసారు. అరకువేలి మండల ప్రధాన కేంద్రంలో ఆర్భాటాముతో సకల హంగులతో స్థానిక అరకు శాసన సభ్యులు మనసున్న మహారాజు చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఎన్నో మహతరమైన సంక్షేమ పథకాలు ముందుకు దూసుకెళ్తున్న ప్రజల పక్షపాతి పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీని ప్రజలంతా ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారని శాసన సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బారి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.