వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

780చూసినవారు
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్
అరకు నియోజకవర్గం డుంబ్రిగుడమండలం కురిడీ పంచాయితీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కిల్లో. రవి కుమార్ బారి ర్యాలీ తో అరకు సమీప జైపూర్ జంక్షన్ నుంచి అరకు సచివాలయం కేంద్రానికి వెళ్ళి సర్పంచ్ అభ్యర్థి, వార్డు అభ్యర్థులు కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తమ గెలుపుకు ప్రజలు సహకరిస్తే పంచాయితీని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తా మన్నారు.ఈ కార్యక్రమంలో కురిడీ పంచాయితీకి చెందిన వైసీపీ నాయకులు ఎస్. కొండలరావు, ఎరుకు నాయుడు, లక్ష్మణరావు, ఎస్.రాజు, చంచిడి, రాజారావు, డొంబు, స్వరూప్, అప్పలరాజు, జగన్, ప్రసాద్, సోములు, శుక్ల, రామచందర్, గురు, కొగ్గు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్