వాలంటీర్లకు అవార్డుల ప్రధానం

3100చూసినవారు
వాలంటీర్లకు అవార్డుల ప్రధానం
చోడవరం నియోజకవర్గం  రావికమతం మండలం దొండపూడి గ్రామంలో, గ్రామ వార్డు సచివాలయల వాలంటీర్లకు అవార్డుల ప్రధాన కార్యక్రమం ఎంపీపీ పైల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.  

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ లో అతి  ముఖ్యమైన పాత్ర వాలంటీర్ దే నని,   ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో అందరికంటే ఎక్కువ బాధ్యతలు, నమ్మకాన్ని వాలంటీర్లకు అప్పజెప్పారని. అందరికంటే పథకాలను అందించడంలో ముఖ్యపాత్ర కూడా నేడు వాలంటీర్లు పోషిస్తున్నారని, అటువంటి భాగ్యం కలిగిన మీరు అదృష్టవంతులు అన్నారు. మీకు  ఒప్పజెప్పిన 50 కుటుంబాల యొక్క బరువు బాధ్యతలను భుజాన వేసుకొని ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.   మీకు అప్పజెప్పిన కుటుంబాల్లో అర్హులైన ఏ ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం పథకం అందలేదనే మాట రాకుండా చూసుకోవాలి అన్నారు. పార్టీలకు కులమతాలకతీతంగా  ప్రతి ఒక్కరికి పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ఒక్క వైయస్సార్ పార్టీకే  దక్కిందన్నారు.

   రానున్న రెండేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరుస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియోజకవర్గానికి అవసరమైనన్ని  నిధులు ఇస్తానని హామీ ఇచ్చారని తద్వారా అన్ని గ్రామాలు అభివృద్ధి అవుతాయన్నారు,  

 అనంతరం 352 మంది వాలంటీర్లకు అవార్డుల ప్రధానం  చేశారు, ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముక్కా మహ లక్ష్మినాయుడు  మండల పార్టీ అధ్యక్షులు కంచిపాటి  జగన్నాధ రావు డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ్ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి తలారి ఆదిమూర్తి, జడ్పిటిసి రమణమ్మ, సీలం శంకర్రావు, గట్రెడ్డి తాతబాబు,   తాసిల్దార్ కనకారావు,   ఎంపీడీవో మూర్తి, జెయి సుమతి, పరువు సర్పంచులు ఎంపీటీసీలు, రావికమతం పంచాయతీ కార్యదర్శి పాతాళ సత్యనారాయణ,   రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్