ఈ ప్రభుత్వంలో దేవుని కూడా దర్శించుకునే భాగ్యం లేదు

1611చూసినవారు
ఈ ప్రభుత్వంలో దేవుని కూడా దర్శించుకునే భాగ్యం లేదు
సర్పంచుల హక్కులను ప్రభుత్వం హరిస్తున్న నేపథ్యంలో ఏడుకొండలవాడికి విన్నవించుకోవడానికి వెళ్తున్న పలువురు సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రొంగలి మహేష్ అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, వెంకటేశ్వర స్వామిని వేడుకొనే హక్కు కూడా పంచాయతీ సర్పంచులకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. సర్పంచులు సామూహికంగా కాలినడకన దైవం చెంతకు వెళుతుంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపినా పాలకులు సహించలేక పోతున్నారన్నారు. కె. కోటపాడు మండలం నుంచి ఐదుగురు టీడీపీ మద్దతుసర్పంచులు తిరుమల పాదయాత్ర కు వెళ్తుండగా అడ్డుకున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆశీస్సులతో సిఎం జగన్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యానాయుడు మనసులు మారి పంచాయతి హక్కులకు భంగం కల్పించకుండా శ్రీ వెంకన్నస్వామి చూడాలని మండల టిడిపి అధ్యక్షులు రొంగలి మహేష్ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్