కల్పవల్లి అనాధ ఆశ్రమంలో వన భోజనాలు

167చూసినవారు
కల్పవల్లి అనాధ ఆశ్రమంలో వన భోజనాలు
అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు మండలం, పాతవలస గ్రామం లో సోమవారం ఉదయం కల్పవల్లి అనాధ ఆశ్రమంలో ప్రముఖ కన్నడ సినీ నటుడు, మానవతా మూర్తి పునీత్ రాజ్ కుమార్ ప్రధమ వర్ధంతి పురస్కరించుకొని కల్పవల్లి అనాధాశ్రమం నిర్వాహకులు కోలా రాజేంద్ర కుమార్ దేవరాపల్లి మండలం వీరభద్రపేట గ్రామంలో గిరిజనులు 70 మందికి ఉచితంగా వనభోజనాలు ఏర్పాటు చేశారు. శీతాకాలం సమీపించిన దృష్ట్యా వారందరికీ దుప్పట్లు పంపిణీ చేశారు.

అంతకుముందు ఆశ్రమంలో పునీత్ రాజ్ కుమార్ చిత్రపటానికి సీనియర్ జర్నలిస్ట్ కుబిరెడ్డి రాధాకృష్ణతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కోలా రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడపడంతోపాటు చనిపోయాక కూడా రెండు కళ్ళను దానం చేసిన మానవతా మూర్తి పునీత్ రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శెట్టి సూరిబాబు, ల్యాబ్ టెక్నీషియన్ వంటాకు గంగునాయుడు, ఆశ్రమం వాలంటీర్లు కొచ్చర్ల బ్రహ్మాజీ, రామసత్య, హేమ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్