మాడుగులలో సెజ్ కోసం సంతకాల సేకరణ

70చూసినవారు
మాడుగులలో సెజ్ కోసం సంతకాల సేకరణ
అన్నింటా వెనుకబడుతున్న మాడుగులలో నిరుద్యోగుల ఉపాధి ఉద్యోగాల కోసం పరిశ్రమలు (సెజ్)ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం నుంచి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. మాడుగుల బస్ స్టాండు ఆవరణలో ఈ కార్యక్రమం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. మాడుగులతో పాటు మండలంలో అన్ని గ్రామాల పర్యటించి కనీసం 10వేల సంతకాలు సేకరించి ఎమ్మెల్యేకి, ఎంపి కి అందజేస్తామని కమిటీ ప్రతినిధి ఎం సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్