చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామంలో యాదవ్ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లల్లో వాడిన నీరు అంతా సీసీ రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బైకులు, సైకిల్ మొదలైన వాహనాలు స్కిడ్ అవ్వడంతో పాటు, వృద్ధుల్లాంటి వారు కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు వేడుకుంటున్నారు.