చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామంలో యాదవుల ఇలవేల్పు గంగాదేవి గావు పండగకు భక్తులంతా తరలిరావాలని దేవధర్మ మేనేజింగ్ డైరెక్టర్ గోకాడ ఝాన్సీ యాదవ్ తెలిపారు. రేపు మంగళవారం జరగబోయే గంగాదేవి గావు పండగ కు తప్పెటగుళ్ళు, నేలవేషాలు, మ్యాజిక్ సోలు కడు రమ్యంగా ప్రదర్శించబడతాయని, అంతేకాకుండా రేపు అనగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి భారీ అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని అందులో భక్తులు అందరూ భాగస్వాములు కావాలని గోకాడ ఝాన్సీ యాదవ్ సోమవారం తెలిపారు.