అడవి అగ్రహారం గ్రామంలో అప్పడు గారి కల్లాలలో నాగుల చవితి వేడుకలు శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో నియోజక వర్గ యాదవ యూత్ అధ్యక్షులు దాలిబోయిన రామ గోవింద యాదవ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ శాస్త్రం లో నాగుల చవితి కి ప్రత్యేకత కల్పించబడిందని తెలిపారు. డివి రమణ, డి కే రావు, చినరమణ, సింగం పల్లి రమణ, శిమ్మన్న, అప్పలనాయుడు, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.