ఫ్రైడే డ్రైడే పాటించండి

648చూసినవారు
ఫ్రైడే డ్రైడే పాటించండి
అనకాపల్లి జిల్లా, కె కోటపాడు మండలం, చౌడువాడలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చౌడువాడ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం చౌడువాడ లోని ప్రతి వీధినీ సందర్శించి పారిశుధ్య పనులను చేయిస్తూ , ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు. గత కొంతకాలంగా పంచాయతీ లో చేపట్టిన ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం దిగ్విజంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం పరిసరాలను పరిశుభ్రపరుస్తూ దోమలు నివసించు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఎరుకు నాయుడు అన్నారు. మంచినీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి డ్రైడే పాటించాలని అన్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ మొదలగు వ్యాధులు దోమలు వల్లే వస్తాయని అందువలన ప్రజలు అంతా కలిసికట్టుగా తగు జాగ్రత్తలను పాటించాలని నాయుడు అన్నారు. సర్పంచ్ ఇరుకు నాయుడు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ప్రసంశలను కురిపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటుగా పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్