అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆర్ అండ్ బి రహదారి గోతులు మయంగా మారి అధ్వానంగా ఉండడంతో గొలుగొండ జడ్పిటిసి సుర్ల గిరిబాబు తన సొంత నిధులతో గోతులను పూడ్చే కార్యక్రమం ఆదివారం మొదలుపెట్టారు మూడు కిలోమీటర్ల మేర రహదారి అధ్వానంగా ఉండడంతో స్పందించిన జడ్పిటిసి గోతులను పోర్చడంతో ఈ ప్రాంత ప్రయాణికులు ఆయనను అభినందిస్తున్నారు