నాతవరం నుంచి తాండవ వెళ్లే రహదారి పరిస్థితి అద్వానంగా ఉండడంతో ఈ రహదారిపై ప్రయాణం నరకంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ రహదారిని విస్తరించకపోవడంతో ఎదురుదురుగా వచ్చే వాహనాలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. బుధవారం ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇచ్చేందుకు రోడ్డు దిగిన ఆర్టీసీ బస్సులో బురదలోకి దిగిపోయింది.