లోకేష్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులకు ఉచితంగా 4సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి లోకేష్ కు పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతి అందజేసి ఆయనతో చర్చించారు. విశాఖ ఎన్టీఆర్ భవన్లో గురువారం మంత్రిని జర్నలిస్టులు కలిశారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టులకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు.