అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలో శనివారం మాజీమంత్రి మత్స్యరాస మణికుమారి మాట్లాడారు. తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవరించడం సిగ్గు చేటు అని అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలల్లో విద్యను బోధించే టీచర్స్ ని నామమాత్రంగా నియమించి వాళ్ళను కూడ తొలిగించే కుట్ర జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.తెలుగు భాషను బోధించే టీచర్స్ ని తొలిగించే నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.