అనకాపల్లి జిల్లానక్కపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జన్మదిన వేడుకలను జనసైనికులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివదత్
అభిమానుల మధ్య కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో జూనియర్ హాకీ విద్యార్ధులకు స్వీట్స్ బాక్షులు పంపిని చేసారు. అనంతరం
నక్కపల్లి మండలం, రాజియ్యపేట గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు 20000 రూపాయలు శివదత్ ఆర్థికసాయం చేసారు.
తదనంతరం శివదత్ మీడియాతో మాట్లాడుతూ. ఈ రోజు నాకు ఎంతో సంతోషకరమైన రోజు. నియోజకవర్గంలో జనసైనికులు అందరూ నా జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. నా పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో కష్టాల్లో ఉన్న వారికి నా వంతు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.