ఆశాజ్యోతి నీడలో ఆరిపోతున్న జ్యోతులెన్నో!

958చూసినవారు
ఆశాజ్యోతి నీడలో ఆరిపోతున్న జ్యోతులెన్నో!
గూడెం కొత్తవీధి: ఆశాజ్యోతి నీడలో ఆరిపోతున్నా జ్యోతులెన్నో ఉన్నాయని ఆంద్రప్రదేశ్ ఆదివాసీ జెఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివాసీల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్తుతిస్తున్నా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆదివాసీల ఆశాజ్యోతి తీసుకొన్న నిర్ణయాల వలన ఆదివాసీలకు బెస్ట్ ఎవైబుల్ స్కూల్స్ పోయాయని, గతంలో అక్కడ చదువుకున్న వారు చదువుకు దూరమైనారని, సచివాలయాల ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాలకు రేషన్ కార్డు, పెన్షన్ పీకేసారని, రైతు భరోస లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

అలా అని వారి ఉద్యోగాలు రెగ్యులైజేషన్ చేయలేదని, ఉద్యోగం ఉంటాదో, ఊడుతాదో అనే భయంతో ఆ జ్యోతులు ఉన్నాయని, ఒకప్పుడు కళకళలాడే ఐటిడిఏ, నిధులు లేమితో బోసి పోయాయని, అల్లూరి అనుచరులైనా గాం గంటన్నదొర, గాం మల్లుదొర తో పాటు మిగతా స్వతంత్ర్య సమరయోదుల కుటుంబాలను గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్షంగానే వదిలేచిందని, స్ధానిక ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించే జిఓ నెంబర్ త్రీ పోతే అతిగతి లేదని, బాక్సైట్ తవ్వకాల జిఓ నెంబర్ 97 రద్దు చేసి జిఓ నెంబర్ 89 ఎందుకిచ్చినట్లోనని, ఐదో షెడ్యుల్ ప్రాంతంలో ఆదివాసీలకు ఉన్న చట్టాలు, హక్కులు ఎందుకు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారని వ్యక్తం చేసారు.

ఆదివాసీలు ఈ దేశానికీ మూలవాసులే కాదు, ప్రపంచానికి పోరాటం నేర్పింది కూడా ఆదివాసీలే నని, ప్రభుత్వాల నుండి తాము పొందాల్చినవి పోరాటం ద్వారనే పొందారూ తప్పా లాలూచీ పడి కాదని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు, జికె వీధి జెఏసి మండల కన్వీనర్ కొర్ర బలరాం, కొర్ర నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్