అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన అల్లూరి చిత్ర యూనిట్ సభ్యులు

534చూసినవారు
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో గల ఏఎల్ పురం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు సమాధులును శనివారం అల్లూరి చిత్ర యూనిట్ సభ్యులు సందర్శించి సీతారామరాజుకు నివాళులర్పించారు. అనంతరం చిత్ర నిర్మాత వేణుగోపాల్ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతం సందర్శించడం ఎంతో ఆనందదాయకం ఉందని వారి సందర్భంగా తెలియజేశారు. అలాగే అల్లూరి స్ఫూర్తితోనే ఈ చిత్రం నిర్మాణం చేయడం జరిగిందని వారు అన్నారు. ఈ నెల 23న సినిమా రిలీజ్ అవుతుందని సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా చేయాలని వారి సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గజ్జిలపు మణికుమారి, సర్పంచ్ లోతుల సుజాత, క్షత్రియ సేవా సంఘం సభ్యులు సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్