గూడెం కొత్త వీధి మండలం: రింతాడ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని గురువారం రింతాడ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాలయం నుండి గ్రామ సచివాలయం వరకు పిల్లలతో ర్యాలీ చేపట్టి, గ్రామ సచివాలయం కార్యాలయంలో స్థానిక సర్పంచ్, కార్యదర్శి, ఉపసర్పంచ్, తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు.
తదనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రశంసిస్తూ, తాను పిల్లలకు నిర్వహించిన జై భీమ్ జ్ఞాన సభ కార్యక్రమాలలో సర్పంచ్, కార్యదర్శి చేతుల మీదగా పెన్నులు పెన్సిలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ గ్రామంలో పిల్లలకు ఆటపాటలతో ఆడిస్తూ, అంబేద్కర్ భావజాలం భావజాలం అందరికీ ప్రభావితం చేస్తున్ననందుకు సర్పంచ్, కార్యదర్శి అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి సచివాలయం-2 కార్యదర్శి సోమేశ్, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, కుమారి సచివాలయం 1, 2 అధికార సిబ్బంది మరియు వాలంటీర్స్, వైసిపి నాయకులు వెంకట్రావు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.