హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలి: గిరిజన సమైక్య డిమాండ్

1048చూసినవారు
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలి: గిరిజన సమైక్య డిమాండ్
ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపండని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య డిమాండ్ చేసింది. విశాఖ పట్నంలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర మహాసభలలో ఎపి గిరిజన సమాఖ్య నాయకులు పాల్గొని ఎర్రవరం పంపెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేఖించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు మాట్లాడుతూ ఐదో షెడ్యూల్డ్ ప్రాంతమైనా అల్లూరి సీతారామరాజు జిల్లా లో గల చింతపల్లి, కొయ్యూరు మండలాల సరిహద్దులలో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ను న్యూ అండ్ రెనెవబ్లూ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించ తలపెట్టి గత కొన్ని నెలల నుండి సర్వేలు చేయిస్తున్నారని, ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో భూబదాలయింపు నిషేద చట్టానికి, పీసా చట్టానికి వ్యతిరేఖంగా ఎటువంటి గ్రామసభలు జరపకుండా ప్రాజెక్ట్ ను నిర్మించాలని చూస్తున్నారని, ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ రెండు మండలాల పరిధిలో గల ఎర్రబొమ్మలు, గొందిపాకలు, వెలగలపాలెం, పెదమాకవరం పంచాయితీలో సుమారు 38 గ్రామాలు జలసమాది అవుతాయని, ఈ గ్రామాల పరిధిలో కాఫీ 15 వేల ఎకరాలు, వరి 4 వేల ఎకరాలు, మిరియాలు 6 వేల ఎకరాలు, జీడిమామిడి 5 వేల ఎకరాలు, వీటితో పాటు 10 రకాలు అంతర పంటలు పండుతాయని, 5 వేల కుటుంబాలు జీవిస్తున్నారని, వారితోపాటు వారి పశులులు, కోడి కొక్కెరతో పాటు ఎన్నో ఔషద సంబధిత మొక్కలు, పక్షులు, జంతువులు, అడవి జలమయం అవుతాయని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎటులంటి అనుమతులు ఇవ్వకూడదని, అలాగే విజయనగరం నుండి రాజమండ్రి వరకు నిర్మిస్తున్న హైవేలో భూములు కోల్పోతున్న ఆదివాసి రైతుల భూమికి భూమి ఇప్పించాలని, బైపాస్ రోడ్డు రద్దు చేసి ప్రస్తుతం ఉన్న ఆర్ అండ్ బి రహాదారి మీదనే జాతీయ రహదారి నిర్మించాలని, రద్దు చేసిన జిఓ నెం త్రీ స్థానం కొత్త చట్టం తీసుకొనిరావాలని తీర్మాణం చేసారు, ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వైవి అంజనేయులు మాట్లాడుతూ గతంలో ట్రైకార్ ద్వారా ఋణాలు వచ్చేవి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఋణాలు రాలేదని, బెస్ట్ ఎవైబుల్ స్కూల్లు లేకపోవడంతో గిరిజన విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారని, ఐటిడిఏ లలో నిధులేక వెలవెలబోతున్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్