రింతాడ గ్రామ సచివాలయంను సందర్శించిన సబ్ కలెక్టర్

879చూసినవారు
రింతాడ గ్రామ సచివాలయంను సందర్శించిన సబ్ కలెక్టర్
పాడేరు సబ్ కలెక్టర్ వి. అభిషేక్ మంగళవారం జీకే వీధి పర్యటనలో చాపరతిపాలెం నుండి రింతాడ వరకు NH516E సర్వే పరిశీలించారు. తదనంతరం మార్గం మధ్యలో రింతాడ గ్రామ సచివాలయం ను సందర్శించి, సచివాలయం సింబ్బంది మరియు వాలంటీర్స్ పనితీరును సర్పంచ్, ఉప సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను, డాష్ బోర్డ్ ను మరియు E సర్వీసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీకే వీధి మండల డిప్యూటీ తాసిల్దార్ రాజ్ కుమార్, స్థానిక సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ సోమేష్ కుమార్, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్, తదతరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్