గూడ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

652చూసినవారు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తేనె వారి వీధిలో శ్రీ బాల వినాయక గూడ్స్ ఆటో యూనియన్ వారు ఏర్పాటుచేసిన వినాయకచవితి వేడుకలకు బీజేపీ రాష్ట్ర ఎవక్యూటివ్ మెంబెర్ తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, పెదిరెడ్డి శ్రీను, యాళ్ల వరాహకు తదితరులు హాజరై వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వినాయక గూడ్స్ ఆటో యూనియిన్ అధ్యక్షులు గుల్లా నాగరాజు మరియుకమిటీ సభ్యులు గత 12సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎల్లవేళలా ఆ వినాయకుడు వారిని వారి కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పల్లా శ్రీను, పెంకే నాగేశ్వరాయి గొర్ల రాము, గురు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్