డెక్కన్ పరిశ్రమ సేవలు ప్రశంసనీయం - ఎమ్మెల్యే

489చూసినవారు
డెక్కన్ ఫైన్ కెమికల్స్ పరిశ్రమ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఎపి అసెంబ్లీ ఎస్ సి వెల్పేర్ కమిటి చైర్మన్ , పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూ రావు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డెక్కన్ పరిశ్రమ జనరల్ మేనేజర్ లక్ష్మిపతిరాజు ఎమ్మెల్యే బాబూరావును మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూల మాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తన కుమారుడు సాయి కార్తికేయను జిఎంకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూరావు మాట్లా డుతూ వెనీకబడిన పాయకరావుపేట నియోజక వర్గంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ పేరుతో ఔషధ పరిశ్రమ స్థాపించటమే కాకుండా వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారంటూ జిఎం లక్ష్మిపతిరాజును ఎమ్మెల్యే ప్రశంసించారు. అలాగే పరిశ్రమ సమీప గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాలతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వ హించటం ముదావహమని ఎమ్మెల్యే బాబూరా వు కొనియాడారు. దీనికి ప్రతిస్పందించిన డెక్కన్ జిఎం లక్ష్మీపతి రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు చూపిస్తున్న చొరవ అభినందించతగ్గదని పేర్కొంటూ, తమ సంస్ధనుంచి ప్రజలకు అవసరమైన సహకారం అందించేందుకు సిధ్ధంగా వున్నామని ఎమ్మెల్యే బాబూరావుకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిఎం లక్ష్మీపతిరాజుతో పాటు కంపెని ప్రతినిధి సూర్య నారాయణరాజు వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్