నక్కపల్లి పోలీస్ స్టేషన్‌ను ఏఎస్పీ తనిఖీ

1507చూసినవారు
విశాఖ జిల్లా నక్కపల్లిలో ఆధునీకరించిన పోలీస్టేషన్‌ ను మంగళవారం నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రారంభించారు. తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఏఎస్పీ, అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసుల వివరాలను నక్కపల్లి సీఐ ఎస్. విజయకుమార్, ఎస్‌ఐ అప్పన్నలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ తుహిన్ సిన్హా మీడియా తో మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ జరుగు తుందన్నారు. ఇందులో భాగంగా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దటంలో కీలకంగా వ్యవహరించిన సి ఐ విజయకుమార్ ను ఏఎస్పీ అభినందించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించటంతోపాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. విజయ్ కుమార్ ఎస్ఐ అప్పన్నతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్