వైసీపీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 13న ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే వైసీపీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ కంబాల జోగులు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో కార్యక్రమ గోడపత్రికలను ఆవిష్కరించారు.