సజ్జల భార్గవ్‌కు షాక్ తప్పదా!
AP: తనపై నమోదు అయిన కేసుల నుంచి కాస్త ఉపశనం కోసం హైకోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈ కేసుల్లో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను వేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సజ్జల భార్గవ్‌కు షాక్ ఇచ్చింది.హైకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. దీనిపై విచారణను ఈరోజుకు వాయిదా వేసింది ధర్మాసనం. అయితే సజ్జల భార్గవ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.