పాయకరావుపేట
పాయకరావుపేటలో నేటి నుంచి హోం ఓటింగ్ కార్యక్రమం
పాయకరావుపేట నియోజకవర్గంలో నేటి నుంచి 8 వరకు హోమ్ ఓటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలి తెలిపారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికే పరిమితమైన వారికి ఎన్నికల సంఘం ఈ హోం ఓటింగ్ అవకాశం కల్పించిందన్నారు. ఇలాంటి వారిని 217మందిని గుర్తించామన్నారు. వీరందరి ఇంటి వద్దకు ఎన్నికల సిబ్బంది వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు.