పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట

75చూసినవారు
పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట
TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనపై ఉన్న మూడు FIRలలో రెండింటిని కోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై మూడు FIRలు నమోదు చేశారని నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లగచర్ల కేసులో A1గా ఉన్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్