వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి అన్నదాతకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. రైతులని ఆదుకొని న్యాయం చేయాలి అన్నారు.