గత నెల 31 తేదీ రాత్రి అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట పాన్ షాప్ దగ్గర జరిగిన వివాదంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువకుడు వినోద్ కుమార్ పై దాడి చేసిన స్థానిక యువకులు గణేష్, యశ్వంత్ లను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డిఎస్పి శ్రావణి ఆదివారం మీడియాకి తెలిపారు. ఆ యువకుల కొట్టడం వలన వినోద్ కుమార్ మృతి చెందినట్టు విచారణలో తేలిందన్నారు. మృతికి కారణమైన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.