అనంతగిరి నడిమీవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వామి దయానంద సరస్వతి వర్ధంతి కార్యక్రమంను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరాజి మల్లేశ్వరరావు, భాషా వాలంటీర్ మహేంద్ర బాబు కలిసి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వామి దయానంద సరస్వతి బాల్యవివాహాలు, అంటరానితనం, వరకట్నం, దురాచారాన్ని బహిష్కరించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన గొప్ప పండితుడని విద్యార్థులకు వివరించారు.