అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ పరిధి బిజ్జగుడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. పొల్లు గృహంలో బుధవారం ఉదయం 9 గంటలకు ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. భయంతో వారు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టలు ఇంట్లో వస్తువులు కాలి బూడిదయిందన్నారు. అధికారులు గుర్తించి తమను ఆదుకోవాలని వారు కోరారు.