అరకు: వేసవిలో దట్టంగా కురిసిన పొగ మంచు

68చూసినవారు
అరకులోయ మండల పరిసర ప్రాంతంలో సోమవారం ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ హెడ్లైట్ వేసుకొని రాకపోకలు సాగించారు. ఒక పక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోయి వడగాల్పులు వీస్తుంటే మరోపక్క తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కొమ్ముకుంటుంది. మండు వేసవిలో కురుస్తున్న పొగమంచు అందాలు అరకు సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకుంటూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

సంబంధిత పోస్ట్