అరకులోయ మండలంలోని గన్నెల పంచాయతీలో చివరి రోజైన మంగళవారం పెసా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పెసా కమిటీ ఉపాధ్యక్షుడిగా రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా కార్యదర్శిగా సంతోష్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన చట్టాలు అమలుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లలితాదేవి సర్పంచ్ బొజ్జ తదితరులున్నారు.