మన్యంలో కొనసాగుతున్న పొగ మంచు తీవ్రత

79చూసినవారు
అల్లూరి జిల్లా మన్యంలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో సూర్యకిరణాలు కనిపించలేదు. ఈ క్రమంలో వాహనదారులు హెడ్ లైట్ వేసుకుని రాకపోకలు కొనసాగించారు. గత కొన్ని రోజులుగా మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతూ ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్