హుకుంపేట మండలంలోని మెరకచింత పంచాయతీ పరిధి కరకపుట్టు పనసపుట్టు గ్రామాల యువతకు బుధవారం ఉదయం టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి శంకర్ నాయుడు పెసా కమిటీ అధ్యక్షుడు రామరావు వాలీబాల్ కిట్లను అందజేశారు. వారు మాట్లాడుతూ. యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలని అటువంటి ఆశయంతో యువకులకు ప్రోత్సహిస్తున్నామన్నారు. నాయకుల ప్రోత్సాహంతో యువత ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండబాబు తదితరులు ఉన్నారు.