డుంబ్రిగుడ మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా మండలంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చటువాలో ఉన్న ఒడిశా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న అవుట్ పోస్ట్ టెంటు కూలిపోయింది. అయితే ఆ సమయంలో ఒడిశా పోలీసులు లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదని చుట్టుపక్కల ప్రజలు తెలిపారు.