పెదబయలు మండలంలో పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. కొరవంగి పంచాయతీలోని చింతలవీధికి చెందిన అప్పలమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంది. దీంతో గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక గర్భిణీ అప్పలమ్మను కుటుంబీకులు మంగళవారం డోలికట్టి చింతలవీధి నుంచి కొరవంగి వరకు 6 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడినుంచి 108లో రూడకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.