భీమిలి నియోజకవర్గం డైట్ కాలేజీలో కౌమారదశలో ఉన్నవారు, యవ్వనదశలో ఉన్నవారు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి క్రమశిక్షణ పాటించిన నాడు లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ వంటి మహమ్మరిని దేశం నుంచి పారదోలవచ్చని డైట్ ప్రిన్సిపాల్ ఎల్. సుధాకర్ అన్నారు. 2030 నాటికి ఎయిడ్స్ రహితదేశంగా భారతదేశాన్ని రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అన్నారు. భీమునిపట్నం డైట్లో శుక్రవారం ఎయిడ్స్ డే సందర్భంగా ఛాత్రోపాధ్యాయులకు ఆయన అవగాహన కల్పించారు.