యూనిటీమాల్ నిర్మాణంతో చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడంతో పాటు చేనేత కళాకారులకు ఆర్థిక భరోసా లభించనుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం ఆమె విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో పక్కనున్న యూనిటీమాల్ కు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 172 కోట్లతో చేపడుతున్న యూనిటీమాల్ నిర్మాణ ప్లాన్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.