సోషల్ మీడియాలో మహిళలపై వైసిపి శ్రేణులు ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తాట తీస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. మధురవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి పని అయిపోయిందన్నారు. జగన్ కు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీకి చెందిన నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. వైసిపి మునిగిపోయే నావ అన్నారు.