విశాఖ ఎంపీ భరత్‌ను జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నరవ పైడిరాజు ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణులు శుక్రవారం కలిశారు. విశ్వకర్మ యువజన పథకం లోన్స్ కొరకు సుమారు 2వేల మంది నాయి బ్రాహ్మణులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఎంపీకి వివరించారు. వెంటనే ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసి లోన్స్ ఇప్పించాలని కోరారు. అలాగే వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.