విశాఖ: రేష‌న్ కార్డుదారుల‌కు పూర్తి స్థాయి స‌ర‌కులు

82చూసినవారు
విశాఖ: రేష‌న్ కార్డుదారుల‌కు పూర్తి స్థాయి స‌ర‌కులు
చౌక డిపోల ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో సరుకులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు నుంచి బియ్యం, పంచదార, కందిపప్పు అందించనున్నది. ఇందుకోసం విశాఖ జిల్లాకు 552 టన్నుల కందిపప్పు, 238 టన్నుల పంచదార కేటాయించింది. కందిపప్పులో సగం ఇప్పటికే గోదాములకు చేరగా, డిపోలకు పంపించారు. మిగిలిన సరుకు నెలాఖరుకల్లా జిల్లాకు చేరనున్నదని పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ శ్రీలత శ‌నివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్