బుచ్చయ్య పేట: ఉపాధి కల్పించి ఆదుకోండి

77చూసినవారు
బుచ్చయ్య పేట: ఉపాధి కల్పించి ఆదుకోండి
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్త విని తన భర్త గుండెపోటుతో మరణించాడని, దీంతో తమ కుటుంబానికి ఆధారం లేకుండా పోయిందని బుచ్చయ్యపేట మండలం కొండపాలెంకు చెందిన ముచ్చకర్ల ధారాలక్ష్మి శుక్రవారం విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఉపాధినిమిత్తం వడ్డాది కేజీబీవీ నందు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగినచర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్